వీధి కుక్కలపై ప్రేముంటే..ఇంటికే తీసుకెళ్లండి!

8
- Advertisement -

వీధి కుక్కలకు ఆహారం పెట్టాలనుకునేవారు ఇంట్లోకే తీసుకెళ్లి పెట్టొచ్చుగా? అని తెలిపింది సుప్రీం కోర్టు. వీధి కుక్కలకు ఆహారం పెట్టాలనుకునేవారు వీధుల్లో కాకుండా, వారి ఇంట్లోనే ఆహారం ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

కాలనీలలోని వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు స్థానికులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. వీధి శునకాలకు ఆహారం పెట్టాలనుకునేవారు ప్రతి రోడ్డును ఉపయోగించుకుంటే మనుషులకు స్థలం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది ధర్మాసనం.

శునకాలపై ప్రేమ ఉన్నవారు వాటిని తమ ఇంటికే తీసుకెళ్లి ఆహారం పెడితే ఎవరు ఆపుతారని అడిగింది సుప్రీం. సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్‌ ఓనర్ అసోసియేషన్లు తమ ప్రాంతంలోని శునకాలకు ఆహారం ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత ఉంటుందని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read:వైసీపీ ఎంపీపై లుక్ అవుట్‌ నోటిసులు

ఇందుకోసం ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించని ప్రదేశాలలో కుక్కలకు ఫీడింగ్ పాయింట్లు ఏర్పాట్లు చేయాలని కోరారు పిటిషనర్.

- Advertisement -