రివ్యూ : కనుపాప

227
Kanupapa - Movie Review
- Advertisement -

మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ – ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్పం. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో ఒప్పం చిత్రం 50 కోట్లుకు పైగా వసూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ఒప్పం చిత్రాన్ని క‌న్న‌డ‌లో శివ‌రాజ్ కుమార్, హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్ రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని దిలీప్ కుమార్ బొలుగోటి స‌మ‌ర్ప‌ణ‌లో మోహ‌న్ లాల్ నిర్మాత‌గా క‌నుపాప అనే టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకువచ్చింది. ఇప్పటికే మనం, జనతాగ్యారేజ్ సినిమాలతో ఆకట్టుకున్న మోహన్‌లాల్‌లో కనుపాపతో ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం.

కథ:

ఒప్పం క‌థ విష‌యానికి వ‌స్తే….ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడిగా న‌టించారు. అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ త‌ప్పించుకుంటాడు. చేయని నేరానికి 14 ఏళ్ల పాటు జీవితఖైదు అనుభవిస్తాడు. ఈ అవమానం తట్టుకోలేక వాసుదేవ్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంది. అందుకే.. తన జైలు జీవితానికి కారణమైన వాళ్లందరి మీదా పగ తీర్చుకోవడం మొదలు పెడతాడు. మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ ను అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఎలా ప‌ట్టుకున్నాడు ? ఆ కిల్లర్‌ నుంచి ఇతరులను ఎలా రక్షించాడన్నదే కనుపాప కథ.

ప్లస్ పాయింట్స్‌ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్  మోహన్‌లాల్‌, కథ, కథనం. ఇలాంటి కథ రాసుకున్న రచయిత గోవింద్ విజయన్‌నీ, ఆ కథని నమ్మి హీరోగా నటించిన మోహన్‌ లాల్‌ని అభినందించాల్సిందే. ఓ అంధుడు హంతకుడ్ని పట్టుకోవడం, అతని బారి నుంచి తననీ, పాపనీ కాపాడుకోవడం అనే పాత్రలో మోహన్‌ ఒదిగిపోయాడు. ఆయన పలికే సంభాషణలు తక్కువైన కేవలం కళ్లతో, హావభావాలతో భయం పుట్టించారు. బేబీ మీనాక్షి నటన ఓకే. మిగిలినవాళ్లవి చిన్న చిన్న పాత్రలే. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం… వీటన్నింటికీ పూర్తి మార్కులు వేయాల్సిందే.  క్లైమాక్స్ సినిమాకే హైలైట్.

Kanupapa - Movie Review
మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ తెలుగు నేటివిటి లేకపోవటం, స్లో నారేషన్. ఫస్టాఫ్ స్లో సాగడం బోర్ కొట్టిస్తుంది. స్లో నేరేషన్‌తో కథ,కథనం నడవటం ఎమోషనల్ ప్లాట్‌కు ఓకే కానీ తెలుగులో ఇలాంటి థ్రిల్లర్స్‌ సినిమాలు తక్కువ కావటంతో కాస్త కొత్తగానూ, స్లోగానూ ఉన్నట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సినిమాకు టెక్నికల్‌గా మంచి మార్కులే పడ్డాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
గతంలో మోహన్ లాల్ కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రియదర్శన్ … ఈ సారి మోహన్ లాల్ నటన మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. నటుడిగా మోహన్ లాల్ ను ఎలివేట్ చేసే సీన్స్ లె పర్ఫెక్ట్ గా రాసుకున్న ప్రియదర్శన్, థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన స్పీడు మాత్రం చూపించలేదు. 4 మ్యూజిక్స్ గ్రూప్ ఇచ్చిన సంగీతం, ఏకాంబరం అందించిన సినిమాటోగ్రఫి ఆడియన్స్ ను కదలకుండా కూర్చోపెడతాయి. మోహన్ లాల్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అయ్యాయి.

తీర్పు :

ఓ అంధుడైన వ్యక్తి ఓ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నాడన్నదే కనుపాప. ఇలాంటి కథను ఎంచుకున్న హీరో మోహన్‌లాల్‌ని నిజంగా అభినందించాల్సిందే. గుడ్డివాడైన జయరాం పాత్ర‌లో ఒదిగిపోయి, తాను త‌ప్ప మ‌రెవ్వ‌రూ ఆ పాత్ర చేయ‌లేర‌నే రీతిలో న‌టించాడు. మోహన్ లాల్ నటన, కథ, కథనం సినిమాకు ప్లస్ పాయింట్ కాగా స్లో నారేషన్, తెలుగు నేటివిటి మిస్సవడం సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా మనం, జనతా గ్యారేజ్‌లో మెప్పించిన మోహ‌న్ లాల్ కనుపాపతో కనురెప్ప తిప్పనివ్వల్లేదు.

విడుదల తేదీ : 03/02/2017
రేటింగ్‌ : 3.5/5
నటీనటులు : మోహన్‌లాల్, బేబీ మీనాక్షి
సంగీతం: ఆ మ్యూజిక్స్‌, రోన్‌ ఎంథెన్‌ యెహన్‌
నిర్మాత: మోహన్‌లాల్‌
రచన, దర్శకత్వం: ప్రియదర్శన్‌

- Advertisement -