భారత దేశ సినీ ప్రపంచంనుఏలిన బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబొర్లపడుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది సినిమాలు చిన్న బడ్జెట్ వచ్చి భారీ వసూళ్లూను రాబడుతున్న సంగతి కూడా తెలిసిందే.తాజాగా శాండల్‌వుదడ్ నుంచి వచ్చిన కాంతార సినిమా కాసుల కనక వర్షం కురిపిస్తుంది.
తాజాగా కాంతారా సినిమా పుష్ప సినిమా కలెక్షన్స్ కూడా దాటిపోయిందని చెప్తున్నారు. అంటే ఈ సినిమా ఒక సునామీ సృష్టించిందనే చెప్పాలి. గత నెల30వ తేదీన చిన్నగా విడుదల అయిన ఈ కన్నడ సినిమా తరువాత మిగతా భాషల్లో అక్టోబర్ 14న విడుదల అయింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల అయిన రోజు నుండీ ప్రభంజనం సృష్టిస్తూనే వుంది.
ఆసక్తికరం ఏంటి అంటే..ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా సైలేంట్‌గా వచ్చింది. ఎటువంటి ప్రచారం కూడా చేయలేదు.రిషబ్‌శెట్టి ఇందులో కథానాయకుడు అలాగే అతనే ఈ సినిమాకి దర్శకుడు కూడా. మంగళూరు దగ్గర ఉండే ఒక పాత సంప్రదాయం ఆధారంగా ఈ సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా తీశారు. అల్లు అర్జున్ నటించి, సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సుమారు 350 కోట్లు గ్రాస్ వసూల్ చెయ్యగా… ఇప్పుడు దాని కూడా దాటేసింది.
ఇవి కూడా చదవండి..