కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా ఆదరిస్తారనేదానికి ఉదహరణ కాంతార మూవీ. మంచి సినిమా వస్తే ప్రాంతం, భాష అనే తేడా లేకుండా ఆదరిస్తారనేదానికి కాంతార మూవీ నిదర్శనం. కన్నడలో విడుదల అయిన ఈ సినిమా అక్కడ భారీ హిట్ అవ్వడంతో రెండు వారాల తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ అనువాదం చేసి రిలీజ్ చేశారు. అంతే మొదలైంది కాంతార సునామీ.
కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అన్ని భాషల్లో కలిపి 31 రోజుల్లో రూ.289.21 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. నేడో, రేపో రూ. 300 కోట్ల మార్క్‌ను చేరుకోనుంది. ఇక తెలుగులో రూ. 50 కోట్ల వసూళ్లను రాబట్టిందంటే కాంతార సినిమా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయనే దర్శకత్వం వహించారు. గ్రామ దేవతల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతోంది. హిందీలో విడుదల అయిన డబ్బింగ్ సినిమాలను కాంతార బీట్ చేసింది. కేజీఎఫ్ 2 రికార్డులను తిరగరాసింది. కాంతారకు పోటీ ఇవ్వగలిగే సినిమాలు ఏమీ లేకపోవడంతో వసూళ్ల పరంగా ఈ సినిమా జోరు మరి కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..