రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజువల్ విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా సినిమాటోగ్రఫీని అర్వింద్ ఎస్. కాశ్యప్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన బి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఇస్తున్నారు. హోంబాలే ఫిలిమ్స్ విజయ్ కిరగందూర్ నెక్స్ట్ లెవల్ లో నిర్మిస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్ లో అక్టోబర్ 2, 2025న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తుండగా ఫైనల్ గా మేకర్స్ ఈ బిగ్ న్యూస్ ని లేటెస్ట్ గా రివీల్ చేశారు. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా సాలిడ్ అనౌన్సమెంట్ ని ఇచ్చారు.
ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు షాకివ్వాలి: కేటీఆర్

