రెండో పెళ్లి చేసుకున్న దర్శకేంద్రుడి మాజీ కోడలు!

53
kanika

దర్శకుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్‌ రెండో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ ర‌చయిత హిమాన్షు శ‌ర్మతో కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలిన క‌నికా వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు,స్నేహితులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్ళికి సంబంధించిన ఫొటోల‌ను క‌నికా థిల్లాన్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నూతన సంవత్సరంలో కొత్త ప్ర‌యాణం అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం హిమాన్షు ..అక్ష‌య్ కుమార్, అత్రాంగీ రేచిత్రాల‌తో బిజీగా ఉండగా క‌నికా.. తాప్సీ హ‌సీన్ దిల్‌రూబా, రాజ్‌కుమార్ హిరానీ సినిమాలకు పనిచేస్తోంది.

రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాశ్ కోవెల‌మూడిని పెళ్లి చేసుకున్న ర‌చ‌యిత క‌నికా థిల్లాన్…..తర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల కారణంగా విడాకులు తీసుకుంది.