Kanguva:కంగువా ట్విట్టర్ రివ్యూ

8
- Advertisement -

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తుండగా దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించగా నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్ కంగువా అదిరిపోయిందని ట్వీట్ చేస్తున్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అని.. ఫైట్స్, విజువల్స్ ఇలా అన్నీ యాంగిల్స్‌లో శివ అదరగొట్టేశాడని చెబుతున్నారు. సూర్య కెరీర్ లోనే బెస్ట్ అవుతుందని చెబుతున్నారు.

ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సూర్య దుమ్ములేపేశాడని, డీఎస్పీ ఆర్ఆర్ బాగుందని, దిశా పటానీ గ్లామర్ కూడా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇంట్రోడక్షన్ సీన్, యేలో సాంగ్ విజువల్ ఫీస్ట్‌గా ఉంటుందని చెబుతున్నారు. కొంతమంది మాత్రం సెకండాఫ్ బాలేదని చెబుతున్నారు. ట్విట్టర్‌లో మిక్స్ డ్ టాక్ వస్తుండగా ఆడియన్స్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:‘కుబేర’.. ఫస్ట్ గ్లింప్స్

- Advertisement -