కంగనా ది బెస్ట్‌ యాక్ట్రెస్:మాధవన్

34
- Advertisement -

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మన రాకెట్రీ బాయ్ ఆర్. మాధవన్. వీరిద్దరూ హిందీలో తను వెడ్స్ మను సినిమాలో నటించారు. రెండు భాగాలుగా విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాధవన్ కంగనా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా మాడీ మాట్లడుతూ…నేను పనిచేసిన చాలా సినిమాల్లో ధైర్యవంతమైన మహిళలు నటించారు. వాళ్లు ఏవో కొన్ని సినిమాల్లో నటించి నటనకు దూరంగా లేరు. సినీ రంగంలో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెరపై నటించాలంటే చాలా ధైర్యం కావాలి..ఈ విషయంలో నేను కంగనాను ప్రశంసించాలి. ఆమె చాలా తెలివైన వ్యక్తి అలాగే నటి.

Also Read: సుధీర్ బాబు… ‘మామా మశ్చీంద్ర’ టీజర్‌

ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఎన్నో మంచి పాత్రలు చేసింది. కేవలం ఒకే తరహా పాత్రలు చేయకుండా అన్ని రకాల పాత్రలను చేస్తోంది. చాలా విభిన్న సినిమాలో నటిస్తోంది. ఒక్కోసారి ఆమె నటనను చూస్తే నాకే ఆశ్చర్యమేస్తుందని అన్నారు. దీనిపై కంగనా ట్విటర్ ద్వారా స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపింది.

Also Read: ఆగస్టు 11..మహావీరుడు విడుదల

- Advertisement -