ఆగస్టు 11..మహావీరుడు విడుదల

39
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివ కార్తికేయన్‌.. ప్రస్తుతం మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహావీరుడు’. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌ కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది.

Also Read: ఎన్టీఆర్ కి మరో విలన్ ?

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా గా మేకర్స్ మహావీరుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

Also Read: ఐసీయూలో చలాకీ చంటి!

ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్.

- Advertisement -