గ్రూప్ రాజకీయాలపై కంగనా కామెంట్స్

20
- Advertisement -

బాలీవుడ్ బోల్డ్ సుందరి కంగనా రనౌత్ ఇప్పటికే హిందీ సినీ ఇండస్ట్రీ పై చాలాసార్లు నెగిటివ్ కామెంట్స్ చేసింది. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై కంగనా మరోసారి నోరు పారేసుకుంది. బాలీవుడ్‌ లో గ్రూప్ రాజకీయాలు నడుస్తాయంటూ సీరియస్ అయ్యింది. గతంలో కంగనా రనౌత్ తో పాటు, దీపికా, ప్రియాంక చోప్రా వంటి భామలు కూడా ఇలాగే వ్యాఖ్యాననించారు. తాజాగా కంగనా రనౌత్ మళ్లీ అలాంటి కామెంట్స్ చేసింది. ఇంతకీ, కంగనా రనౌత్ ఏం మాట్లాడింది అంటే.. ‘బాలీవుడ్‌లో క్యాంపులు, ఫేవరెటిజం ఉంటాయనేది అందరికీ తెలిసిందే. తమ సినిమాల్లో ఎవరిని తీసుకోవాలంటే వాళ్లనే తీసుకుంటారు. ఇండస్ట్రీలోకి వచ్చే ముందే నాకు ఇది తెలుసు అని చెప్పింది. పైగా కంగనా రనౌత్ అనే తనను తొక్కడానికి చాలామంది కుట్రలు పన్నుతున్నారని కంగనా రనౌత్ తెలిపింది.

కంగనా రనౌత్ ఇంకా మాట్లాడుతూ.. ‘ నన్ను ఏం చేసినా.. నేను ఎప్పటికీ నాలాగే ఉంటాను. ఒక్కసారి ఇక్కడికి వచ్చాక అన్నీ భరించాలి. ఎవరినీ విమర్శించలేం. ఏమున్నా సర్దుకుపోవాలి. అది కంగనా రనౌత్ అయినా, మరో హీరోయిన్ అయినా. ఇక్కడ అందరూ ఒక్కటే. అప్పుడే బాలీవుడ్ లో రాణిస్తాం. లేదు అంటే.. ఇక్కడ జీవితం లేదు’ అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా రనౌత్ నటించిన సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. అందుకే కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో రోజురోజుకు మార్కెట్ డౌన్ అవుతుంది.

అన్నట్టు రీసెంట్ గా కంగనా రనౌత్ మాట్లాడుతూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటించిన సినిమాలతో తనకు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది అని, కాకపోతే, తనకు సౌత్ లో ఎలాంటి స్టార్‌ డమ్ రాలేదని కంగనా రనౌత్ చెప్పింది. కానీ ఒక నటిగా సౌత్ లో తనకు మంచి సంతృప్తే దొరికింది, అందుకే సౌత్ లో భవిష్యత్తులో ఎక్కువ సినిమాలు చేస్తాను అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.

Also Read:గంజాయి కేసులో బిగ్ బాస్ షణ్ముఖ్ అరెస్ట్..

- Advertisement -