సినీరంగంపై మ‌హా స‌ర్కారు వివక్ష చూపుతోంది- కంగ‌నా

99

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై మ‌రోసారి మండిపడింది. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెర‌వడానికి అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవడం స‌రికాద‌ని ఆమె అన్నారు. దేశంలో క‌రోనా తగ్గుముఖం పట్ట‌డంతో అనేక‌ రాష్ట్రాలు థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతినిచ్చాయ‌ని ఆమె చెప్పారు.మహారాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఇందుకు అంగీక‌రించ‌పోవ‌డం సరికాద‌ని, సినీరంగంపై ఆ రాష్ట్ర స‌ర్కారు వివక్ష చూపుతోందని కంగ‌నా ఆరోప‌ణ‌లు గుప్పించారు.

ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధ‌మ‌య్యాయ‌ని ఆమె అన్నారు. థియేటర్లు తెర‌వ‌డానికి ఒప్పుకోకుండా వాటిని పూర్తిగా మూసేయాలని ఆ రాష్ట్ర స‌ర్కారు భావిస్తోంద‌ని ఆరోపించారు. మ‌హారాష్ట్ర పభుత్వం సినీ పరిశ్రమని వివక్షతో చూస్తున్నప్పటికీ దీనిపై ఎవరూ మాట్లాడ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని కంగ‌నా చెప్పారు. కాగా, కంగ‌నా ర‌నౌత్ న‌టించిన‌ ‘తలైవి’ సినిమా విడుద‌ల నేప‌థ్యంలోనూ మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెర‌వడానికి అనుమ‌తులు ఇవ్వ‌లేదు. ఇక కంగనా సినిమాలో విషయానికొస్తే.. ప్రస్తుతం యాక్షన్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘ఢాకాడ్’, ‘తేజస్’, ‘ఎమర్జెన్సీ’ వంటి కమర్షియల్‌ చిత్రాలతోపాటు ‘సీత: ది ఇన్‌కార్నేషన్‌’ వంటి పౌరాణిక చిత్రంలోనూ నటిస్తోంది.