ప్రభాస్ పై కంగనా కామెంట్స్ వైరల్

35
- Advertisement -

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ రీసెంట్ గా నెపోటిజం వల్లే కొందరికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయని అంది. ఐతే, ఇదే క్రమంలో ట్విట్టర్ లో ఓ నెటిజన్ ప్రభాస్ తో నటించారు కదా.. ఆ అనుభవాన్ని షేర్ చేయాలని అడగ్గా.. కంగనా ప్రభాస్ గురించి కూడా స్పందించింది. ఇంతకీ, కంగనా రనౌత్ ప్రభాస్ గురించి ఏం మాట్లాడిందో తెలుసా ?.. ప్రభాస్ చాలా మర్యాద తెలిసిన వ్యక్తి అట. ముఖ్యంగా ప్రభాస్ చాలా మంచి ఆతిథ్యం ఇస్తాడు అని, ఇక ప్రభాస్ ఇంట్లో వండిన భోజనం చాలా అద్భుతం ఉంటుంది అని, ఆ భోజనాన్ని తానూ తిన్నాను అని.. ప్రభాస్ గుడ్ పర్సన్ అని కంగనా చెప్పుకొచ్చింది. మొత్తానికి కంగనా రనౌత్ ప్రభాస్ గురించి పాజిటివ్ కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే కంగ‌నా ర‌నౌత్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంది. ప్ర‌ముఖ జ్యోతిషుకుడు ఎం.బాలు చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు కంగ‌న బుధ‌వారం ఉద‌యం శంషాబాద్‌లోని పంచ‌వ‌తి పార్క్‌లో మొక్క‌ను నాటింది. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ జి.సంతోష్‌ను ఆమె అభినందించింది. ఈ హ‌రిత ఉద్య‌మంలో అంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని కంగనా రనౌత్ పిలుపునిచ్చింది. గ్రీన్ ఇండియా కోఫౌండ‌ర్ రాఘ‌వ వృక్ష వేదం గ్రంథాన్ని బ‌హూక‌రించారు. అనంతరం కంగనా రనౌత్ రచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. కె. వి. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కంగనా కోసం రెండు స్క్రిప్ట్ లు సిద్ధం చేశాడట.

ఇవి కూడా చదవండి..

- Advertisement -