నరేష్ కి ‘నాంది’ ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. అప్పటి వరకూ కామెడీ పాత్రలతో అలరిస్తూ డిఫరెంట్ కేరెక్టర్స్ తో అలరించిన అల్లరి నరేష్ ను కంప్లీట్ మార్చేసి సరికొత్త ఇంటెన్స్ కేరెక్టర్ తో ప్రెజెంట్ చేసి సక్సెస్ కొట్టాడు విజయ్ కనకమేడల. హరీష్ శంకర్ శిష్యుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైన విజయ్ అల్లరి నరేష్ కి ఎప్పటికీ గుర్తుండే సినిమా అందించాడు.
అయితే నాంది తర్వాత విజయ్ కి చాలానే ఆఫర్స్ వచ్చాయి. కొందరి హీరోలకు కథలు కూడా చెప్పాడు. కానీ ఎందుకో పనవ్వలేదు. వెంటనే నరేష్ ను సంప్రదించి ఉగ్రం కథ చెప్పాడు. వెంటనే కాంబో సెట్ అయింది. నాంది కాంబో కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా వెంటనే దొరికేశారు. అయితే ఈ కాంబో లో రెండే కాదు మరో సినిమా కూడా ఉండబోతుంది.
తాజాగా ‘ఉగ్రం’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ విజయ్ తో మూడో సినిమా చేస్తున్నా అంటూ ప్రకటించాడు. కాకపోతే తను ఒక సినిమా నేనొక సినిమా చేశాకే వచ్చే ఏడాది మళ్ళీ కలిసి ఓ సినిమా చేస్తామని చెప్పాడు. దీంతో నాంది కాంబోలో మూడో సినిమా అనే న్యూస్ బయటికొచ్చింది. విజయ్ ఉగ్రం షూటింగ్ లోనే నరేష్ కి ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పి ఉండొచ్చు. అందుకే నరేష్ కాన్ఫిడెంట్ ఈవెంట్ లో మూడో సినిమాను ఎనౌన్స్ చేశాడు కావొచ్చు. మరి ఈ కాంబోలో రాబోయే ఉగ్రం సక్సెస్ ని బట్టే మూడో సినిమా ఉంటుంది. ఈ సినిమా టాక్ ఏమాత్రం తేడా కొట్టినా మూడో సినిమా కష్టమే.
ఇవి కూడా చదవండి..

