అమీర్ విడాకులపై స్పందించిన కంగనా..!

156
kangana
- Advertisement -

బాలీవుడ్ కపుల్ అమీర్ ఖాన్ – కిరణ్ రావు తమ 15 ఏళ్ళ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడంపై స్పందించారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. వీరిద్దరి విడాకులకు కారణం కులాంతర వివాహమేనా ? అంటూ అనుమానం వ్యక్తం చేసింది కంగనా.

కిరణ్ రావు హిందూ మతానికి చెందినది అయినప్పుడు అమీర్ ఖాన్ తన కొడుకును ఎందుకు హిందువుగా పెంచలేదు ? అంటూ ప్రశ్నించింది. అమీర్ ఖాన్-కిరణ్ రావు విడాకుల విషయంలో కులాంతల వివాహం ముఖ్యపాత్ర పోషించిందని చెప్పుకొచ్చింది.

కిరణ్ రావు వివాహం తరువాత ఇస్లామిక్ లోకి ఎందుకు మారిపోయింది ? ఆమె హిందూ మతాన్ని ఎందుకు కొనసాగించలేదని ప్రశ్నించింది కంగనా. కంగనా వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

- Advertisement -