తిరిగి సెట్స్‌పైకి పుష్ప టీం..!

94
pushpa

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రం తెరకెక్కుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌కి బ్రేకప్‌ పడింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

సికింద్రాబాద్ లోని సెట్ లో పుష్ప” టీం తిరిగి చిత్రీకరణను ప్రారంభించారు. 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుండగా ఈ షెడ్యూల్ లో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాసిల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్‌లో కీలక నటులతో సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా బన్నీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా ఈ పాన్ ఇండియన్ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తినెలకొంది.