తన ఇల్లు కూల్చొద్దు..ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ

4
- Advertisement -

తన ఇల్లు కూల్చొద్దని ప్రజావాణిలో కోరారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో తన ఇల్లు స్థలం ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమిని సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ప్రజావాణిలో అధికారులను కోరారు.

కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం 1100 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు నిర్ణయించారు.

కేబీఆర్ పార్కు సమీపంలోని కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ల పరిధిలో ఏడు స్టీల్ బ్రిడ్జీలు, ఏడు అండర్ పాసుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

సినీ హీరో బాలకృష్ణ ఇంటిలో కొంతభాగం, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, అల్లు అర్జున్ మామ కె. చంద్రశేఖరరెడ్డితో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతల స్థలాలున్నాయి.

Also Read:వీడియో..హైవేపై 8 పల్టీలు కొట్టిన కారు!

- Advertisement -