ముని, కాంచన, కాంచన-2 తో హర్రర్ కామెడి చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే హ్యజ్ సక్సస్ ని సాధించిన రాఘవ లారెన్స్ హీరోగా, దర్శకుడిగా ముని ప్రాంచాయిస్ నుండి వస్తున్న హర్రర్ కామెడి చిత్రం కాంచన-3, రాఘవ లారెన్స్ అందించిన హర్రర్ చిత్రాలన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా బాక్సాఫీస్ ని షెక్ చేసినవే.. ఈ కాంచన-3 చిత్రం మాత్రం లారెన్స్ కి స్పెషల్ చిత్రంగా తెరకెక్కుతుంది. తమిళ,తెలుగు బాషల్లో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొస్తుంది. రాఘవ లారెన్స్ ఏమి చేసినా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పడు కాంచన-3 కొసం ఆయన ఓక మెషన్ పోస్టర్ ని తెలుగు వెర్షన్ కొసం రిలీజ్ చేశారు. అయితే ఒక శ్లోఖం తో స్టార్టయ్యి స్లమ్ ఎరియాని చూపిస్తూ క్లాత్ నుండి యాక్షన్ సీన్ అక్కడి నుండి రుద్రాక్షలు ధరించి , తెల్లటి పంచెకట్టుకుని, వైట్ హెయిర్ స్టైయిల్ తో దర్జాగా కూర్చిని వున్న హీరో పోస్టర్ ని తెలుగులొ మెట్టమెదటి సారిగా డాల్బి అట్మాస్ సౌండ్ తో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో లైట్ హౌస్ మూవీమేకర్స్ LLP బ్యానర్ పై బి.మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రోడక్షన్స్ బ్యానర్ లో రాఘవ నిర్మాణం లో తెరకెక్కించారు. ఏప్రిల్ 18న విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మెషన్ పోస్టర్ ని పాత్రికేయ మిత్రుల కొసం ప్రత్యేఖంగా ప్రదర్శించారు.
ఈ సందర్బంగా బి.మధు గారు మాట్లాడుతూ.. రాఘవ లారెన్స్ స్వయంగా అందించిన హర్రర్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. అందులో ముని సీక్వెల్స్ మరీ స్పెషల్. కాంచన్ పేరుతో స్టార్టయిన తరువాత ఇప్పుడు కాంచన-3 గా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాము. రాఘవ లారెన్స్ కి ఈ చిత్రం చాలా ప్రత్యేఖం అనే చెప్పాలి. ఈ సీరిస్ లో ఇది నాలుగో చిత్రం. ఆయన ప్రతి చిత్రం లో తన గెటప్ ని సామాన్య ప్రేక్షకుడికి దగ్గరగా వుండేలా చూసుకున్నారు. ఇప్పడు ఈ చిత్రంలో వైట్ హెయిర్ తో న్యూస్టైల్ కి నాంది పలికారు. మెము విడుదల చేసిన కాంచన -3 మెషన్ పోస్టర్ విత్ సౌండ్ కి ఇప్పటికే స్పందన చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మా బ్యానర్ లైట్‌హౌస్ మూవి మేకర్స్ LLP బ్యానర్ లో రాఘవ నిర్మాణం లో తెరకెక్కించాము. ఆడియన్స్ కూడా ఈచిత్రం కొసం చాలా ఆశక్తిగా ఎదురు చూడటం విశేషం. గత మూడు చిత్రాలని మించి కాంచన-3 వుండబోతుందని నమ్ముతున్నాము.. అని అన్నారు.
నటీనటులు.. రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కొవైసరళ, కభీర్ దుహన్ సింగ్, శ్రీమన్, దేవదర్శిని, సత్యరాజ్, కిషోర్ తదితరులు,సినిమాటోగ్రఫి- వెట్రి, సర్వెష్ మురారి,పి.ఆర్.ఓ- ఏలూరు శ్రీను,లైట్ హౌస్ మూవీమేకర్స్ ఎల్.ఎల్.పి బ్యానర్,
బి.మధు సమర్పించు,రాఘవేంద్ర ప్రోడక్షన్స్,రాఘవ నిర్మాణం,కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం రాఘవ లారెన్స్