ఎన్టీఆర్ బయోపిక్‌..మోహన్ బాబు ఏమన్నారంటే

192
mohan babu

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభతరుణం రాణేవచ్చింది. బాలయ్య-క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది కథానాయకుడు. బాలయ్య హైదరాబాద్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూడగా పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌ని వీక్షించారు. సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనదైన శైలీలో స్పందించారు. అన్నయ్య మళ్లీ పుట్టాడనిపించిందని చెప్పుకొచ్చారు. రామారావు.. నాకు అన్నయ్య. ఏక గర్భమునందు జన్మించకపోయినా మనమిద్దరం అన్నదమ్ములం’ అని చెప్పిన మహానుభావుడు. ఆయన బయోపిక్‌ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదన్నారు.

కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్ళీ అన్నయ్య పుట్టాడా..? అనిపించింది. బాలకృష్ణ కొన్ని యాంగిల్స్‌లో తన తండ్రిని పోలి ఉండడం అనేది కూడా ఒక అద్భుతం. ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను ట్వీట్ చేశారు.

mohan babu