వెండితెరపై శ్రీదేవి బయోపిక్…

213
sridevi

ఆమె ఒక నటనాతరంగం .. అభిమానుల గుండెల్లో వెల్లువగోదావరిలా ఉప్పొంగింది.ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకుంది. పుట్టింది తమిళనాడులో అయిన తన నటనతో ఎక్కడికి వెళ్లిన తమ ఇంట్లో మనిషే భావన కలిగించింది. అర్ధశతాబ్దం పాటు భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అందాల జాబిలి శ్రీదేవి.నాలుగు తరాల స్టార్ హీరోలందరితోనూ నటించిన హీరోయిన్‌గా రికార్డు సృష్టించింన శ్రీదేవి బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

శ్రీదేవి జీవిత నేప‌థ్యంలో సినిమా తీసేందుకు ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికంటే ముందే బోని.. శ్రీదేవి బ‌యోపిక్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న
చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. శ్రీదేవి జీవితంపై సినిమా తీయడానికి కాపీ రైట్స్‌ కూడా తీసుకునే ప‌నిలో బోనీ ఉన్నాడ‌ని స‌మాచారం. మ‌రి శ్రీదేవి పాత్ర కోసం ఏ న‌టిని ఎంపిక చేసుకుంటారో అన్నది సస్పెన్స్‌గా మారింది.

Image result for sridevi biopic

బాలనటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టిన శ్రీదేవి అంచెలంచెలుగా ఎదిగింది. కేవలం మనదేశంలోనే కాదు విదేశాలలోను శ్రీదేవిపై అంతులేని అభిమానం ఉంది. ఆమె మ‌ర‌ణం శ్రీదేవి కుటుంబ స‌భ్యుల‌నే కాదు యావ‌త్ ప్ర‌పంచాన్ని షాక్‌కి గురి చేసింది.