కాంచ‌న‌ 3 రివ్యూ..

461
Kanchana 3 Review
- Advertisement -

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంచన 3’. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందడం, ఇప్పటి వరకు ఈ సీరిస్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. మరి కాంచన 3తో లారెన్స్‌ ఏ మేరకు భయపట్టిచాడో చూద్దాం..

కథ:

సిటీలో రౌడి భ‌వాని(క‌బీర్ దుహ‌న్ సింగ్‌) అత‌ని మనుషులు కొంత మంది పోలీసుల‌ను హ‌త‌మారుస్తారు. మ‌రుస‌టి రోజు భ‌వాని, అత‌ని మ‌నుషుల‌ను కాళి (రాఘ‌వ లారెన్స్‌) ప్లాన్ వేసి చంపేస్తాడు. మ‌రో ప‌క్క ఓ వ్య‌క్తి త‌న కూతురికి ప‌ట్టిన దెయ్యాన్ని బంధించి మేకుల రూపంలో చెట్టుకు కొట్టించి వ‌చ్చేస్తాడు. అక్క‌డి నుండి క‌థ మ‌రో మ‌లుపు తీసుకుంటుంది. సిటీలో ఉండే రాఘ‌వ‌ (రాఘ‌వ‌లారెన్స్‌), అత‌ని త‌ల్లి (కోవై స‌ర‌ళ), వ‌దిన‌ (దివ్య ద‌ర్శిని), అన్న కూతురుతో కలిసి సంతోషంగా జీవితాన్ని గ‌డుపుతుంటాడు. వరంగ‌ల్‌లో తాత‌య్య ష‌ష్టిపూర్తి కార్య‌క్ర‌మానికి బ‌య‌లుదేరుతాడు. మార్గ‌మ‌ధ్యంలో ఓ చెట్టు ద‌గ్గ‌ర ఆగుతారు. అనుకోకుండా అక్క‌డి చెట్టుకు కొట్టిన మేకుల‌ను ఆ కుటుంబం పీకేస్తుంది. ఆ మేకులు వారున్న బాక్సులో ప‌డిపోతాయి. వారు ఇంటికి వ‌చ్చేస్తారు. రాఘ‌వ తాత‌య్య ష‌ష్టిపూర్తికి వ‌చ్చిన త‌న మ‌ర‌ద‌ళ్లు (వేదిక‌, ఓవియా, నిక్కీ తంబోలి)ల‌తో సంతోషంగా ఆడిపాడుతుంటాడు. అయితే రాత్రి అవ‌గానే ఎవ‌రో తిరుగుతున్న‌ట్లు.. ఏడుస్తున్న‌ట్లు శ‌బ్దాలు వ‌స్తుంటాయి. ఇంట్లో వాళ్లు భ‌య‌ప‌డి అఘోరాను పిలిపిస్తారు. అక్కడి నుండి అసలు కథ మొదలౌతుంది. మిగతా కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్‌ :

లారెన్స్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. కామెడీ తో పాటు మంచి హారర్ థ్రిల్లర్ గా ఉందట. గత ముని సీక్వెల్స్ కంటే ఇప్పుడు మాస్ యాక్షన్ సీన్ లో హై రేంజ్ ఉన్నాయి. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. లారెన్స్ మరోసారి అద్భుతంగా కష్టపడ్డారని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక కామెడీ అందిస్తూనే హారర్ సీన్స్.. ఎమోషన్ సీన్స్ ని లారెన్స్ సమపాళ్లలో అందించాడు. అలాగే స‌ర్వేష్ మురారి కెమెరా వర్క్‌, వెట్రి ప‌ళ‌నిస్వామి కెమెరా వర్క్ సినిమాకు ప్ల‌స్‌గా మారింది.

మైనస్ పాయింట్స్:

పాట‌లు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఓవియా, వేదిక‌, నిక్కీ కేవ‌లం ఓ సాంగ్‌.. బావ‌తో స‌ర‌సాలు అడ‌టానికే అన్న‌ట్లు ఉన్నారు. ఇక రాఘ‌వ లారెన్స్ కొన్ని స‌న్నివేశాల్లో కామెడీ సీన్స్‌లో ఓవ‌ర్ యాక్ష‌న్ చేశాడా? అనిపిస్తుంది. ఇక ముగ్గురు మ‌ర‌ద‌ళ్లు బావ‌తో అంద‌రి ముందు బావ చంక ఎక్క‌డం.. ముద్దు ముచ్చ‌ట్లు ఆడ‌టం చూస్తే.. ఏంటి ఇలాంటి మ‌ర‌ద‌ళ్లు ఉంటారా? అనిపిస్తుంది. ఇక కాళి పాత్ర‌లో పాత్రను గొప్ప‌గా చూపించ‌డం ఏంటో అర్థం కాలేదు. కాళి పాత్ర చాలా మంచి ప‌నులే చేస్తుంటుంది కానీ ఆ పాత్ర‌కు ఆ రేంజ్ బిల్డ‌ప్ అవ‌స‌రం లేద‌ని అనిపిస్తుంది.

సాంకేతికవర్గం:

ఈ సినిమాకు ప్రొడక్షన్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్‌లో క్వాలిటీ బాగుంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మారో ఆకర్షణ అని చెప్పాలి.సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.

తీర్పు:చివరిగా లారెన్స్ కాంచన 3తో బాగానే భయపట్టిచాడు..

విడుదల తేదీ:19/04/2019
రేటింగ్ 3

న‌టీన‌టులు: రాఘవ లారెన్స్‌, వేదిక‌, ఓవియా, నిక్కీ తంబోలి
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్
ఛాయాగ్ర‌హ‌ణం: స‌ర్వేష్ మురారి, వెట్రి ప‌ళ‌ని స్వామి
కూర్పు: రూబ‌న్‌
మాట‌లు: రాజేష్ ఎ.మూర్తి
నిర్మాత‌: రాఘ‌వ‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: రాఘ‌వ లారెన్స్‌

- Advertisement -