100 కోట్ల క్లబ్‌లో… ‘కాంచన 3’..!

434
kanchana 3
- Advertisement -

రాఘవ లారెన్స్‌ హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన3’. రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ బేనర్‌పై రాఘవ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బేనర్‌పై అభిరుచి గల నిర్మాత ఠాగూర్‌ మధు గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 19న రిలీజైన ఈ సినిమా డబుల్‌ మాస్‌ హిట్‌గా నిలిచి అద్భుతమైన కలెక్షన్స్‌ రాబడుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ఏప్రిల్‌ 24న ‘గ్రాండ్‌ సక్సెస్‌మీట్‌’ని నిర్వహించింది. నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – ”కాంచన3’ ఏప్రిల్‌ 19న రిలీజై అటు తమిళనాడు, ఇటు ఆంధ్ర, తెలంగాణలతో పాటు వరల్డ్‌వైడ్‌గా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’ సూపర్‌హిట్స్‌ అయ్యాయి. ఇప్పుడు ‘కాంచన3’ అంతకన్నా పెద్ద హిట్‌ అయ్యింది. ఒక డ్యాన్సర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, తర్వాత మెయిన్‌ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, నెంబర్‌వన్‌ డ్యాన్స్‌ మాస్టర్‌గా, హీరో, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ ఇలా అన్ని విభాగాల్లో సక్సెస్‌ అయ్యి చాలా పెద్ద రేంజ్‌కి వెళ్ళారు లారెన్స్‌. అలా ఎదుగుతూ ఎన్నో మంచి పనులు చేస్తూ.. రియల్‌ లైఫ్‌లో కూడా హీరోగా ఎదిగారు. ఆయన చేసిన మంచి పనులే ఆయన సినిమాలకు కథలు. హ్యాండీకాప్డ్‌ పిల్లల్ని ఆదరించి, వాళ్లకు చదువు చెప్పించి మంచి లైఫ్‌ని ఇచ్చారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదుకున్నారు. లారెన్స్‌ను ఎందుకు యాక్సెప్ట్‌ చేస్తారంటే.. రియల్‌ లైఫ్‌లో అవన్నీ చేస్తారు. అందుకనే ఈ సినిమా అంత పెద్ద సక్సెస్‌ అయ్యింది. ఇంకా పెద్ద సక్సెస్‌ అవుతుంది. ‘కాంచన’ పది సిరీస్‌లు రావాలి. అన్నీ సూపర్‌హిట్స్‌ అవ్వాలి. అలాగే నిర్మాత ఠాగూర్‌ మధు ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు. ఆయనకి ఈ సినిమా ద్వారా మరింత మంచి పేరు రావడం చాలా సంతోషం. త్వరలో రాబోయే ‘అర్జున్‌ సురవరం’, ‘అయోగ్య’ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించాలి” అన్నారు.

నిర్మాత ఠాగూర్‌ మధు మాట్లాడుతూ – ”కాంచన3′ సినిమాని బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. లారెన్స్‌గారు ఓ చిన్న క్రైసిస్‌లో చాలా బాగా హెల్ప్‌ చేశారు. అందుకు ఆయనకు థాంక్స్‌. ‘కాంచన3’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 75 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. రెండు, మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్‌ని క్రాస్‌ చేసి, ‘కాంచన2’ కలెక్షన్స్ దాటబోతోంది. ఇంతటి ఘన విజయానికి కారణమైన మా ‘కాంచన3’ టీమ్‌తో పాటు, మాకు సహకరిస్తున్న మీడియాకి ధన్యవాదాలు” అన్నారు.

హీరోయిన్‌ వేదిక మాట్లాడుతూ – ”కాంచన3′ ఇంత మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. సినిమాని పెద్ద బ్లాక్‌ బస్టర్‌ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్‌. ఇంతటి మంచి సినిమాలో నన్ను కూడా భాగం చేసినందుకు డైరెక్టర్‌ లారెన్స్‌, నిర్మాతకి థాంక్స్‌ తెలిపారు.

లారెన్స్‌ మాట్లాడుతూ – ”ముఖ్యంగా ఈ సినిమాని బ్లాక్‌ బస్టర్‌ని చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. ఆడియన్స్‌కి నచ్చుద్దా? లేదా? అని నేను 100 సార్లు చూసుంటాను. అలాగే ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాలు కష్టపడ్డాను. సినిమా చూసి మీరు ఎంజాయ్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా చాలా హ్యాపీ. మధుగారు చాలా మంచి మనిషి. ఆయన ఇంకా పెద్ద హిట్స్‌ కొట్టాలి. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చినందుకు సంతోషం. రాబోయే సినిమాలన్నీ మంచి హిట్స్‌ అవ్వాలి. వేదిక సినిమాలో డ్యాన్స్‌లు, కామెడీ బాగా చేసింది. ఆమెకు మరిన్ని ఆఫర్లు రావాలని రాఘవేంద్రస్వామిని కోరుకుంటున్నా. నిక్కీ తంబోలా ఆల్‌రెడీ ఒక సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. రెండో సినిమా ‘కాంచన3’ కూడా పెద్ద హిట్‌ అయ్యింది. లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమెకి కూడా మంచి ఆఫర్లు రావాలి. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్‌ అందరికీ ధన్యవాదాలు. డబ్బింగ్‌ స్ట్రెయిట్‌ సినిమాలా చాలా బాగా చెప్పారు. అలాగే నిన్న నేను ‘జెర్సీ’ సినిమా చూశాను. చాలా బాగుంది. అందరూ చూడండి. హీరో, దర్శకుడు చాలా బాగా చేశారు. ఈ రెండూ సినిమాలు బాగా ఆడాలి” అన్నారు. కాంచన 2 మూవీ 100 కోట్లు వసూలు చేసిందని కాంచన 3 కూడా వందకోట్ల క్లబ్‌లో చేరనుందని తెలిపారు.

- Advertisement -