పాక్ క్రికెట్ టీంపై తీవ్ర విమర్శలు

1
- Advertisement -

బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి అనంతరం పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సిరీస్ పరాజయంతో పాకిస్థాన్ క్రికెట్ మరోసారి విమర్శల పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా 2-1 తేడాతో విజయం సాధించింది.

సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో పాక్ ఆటగాడు సల్మాన్ ఆఘా అద్భుతంగా ఆడి 98 బంతుల్లో 106 పరుగులు చేశాడు. అయినప్పటికీ జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. చివరకు పాకిస్థాన్ 279 పరుగులకు ఆలౌట్ అయింది. చివరి బంతికి కెప్టెన్ షహీన్ షా ఆఫ్రిది స్టంపౌట్ కావడంతో బంగ్లాదేశ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ పరాజయం తర్వాత మాజీ పాకిస్థాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు నెదర్లాండ్స్ వంటి జట్లు కూడా మాతో సిరీస్ ఆడాలని కోరుకుంటాయి. మమ్మల్ని ఓడించి టెస్ట్ స్టేటస్ సంపాదించాలనుకుంటాయి. పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి ఇంత దారుణంగా మారింది అని అన్నారు.

అంతేకాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీపై కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మ్యాచ్‌లు గెలవలేకపోతే ఇప్పుడు ఐసీసీ ట్రోఫీలు దొంగిలించి ఇంటికి తీసుకెళ్తారా? అంటూ విమర్శించారు.

Also Read:2027 వరల్డ్ కప్‌ గెలవడమే టార్గెట్!

- Advertisement -