కామారెడ్డి ఆర్డీఓ నరేందర్‌పై సస్పెన్షన్ వేటు..

655
Kamareddy RDO Narender
- Advertisement -

గతంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం తహసీల్దార్ గా పని చేశాడు నరేందర్. జిన్నారం తహసీల్దార్ గా ఉన్న సమయంలో ఖాజీపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా అసైన్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టర్ అసైన్ భూమి మార్పుపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీంతో అసైన్ భూమిగా మార్చుటకు బాద్యుడిని చేస్తూ నరేందర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టుగా సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెన్షన్ తో పాటు నరేందర్ పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.ముందస్తు బెయిల్ కోసం నరేందర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.ఆర్డీఓ సస్పెన్షన్ వేటుతో జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో ఆందోళన గురైంది. ఇక్కడ ఆర్డీఓగా పని చేసి కోటి 12 లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడిన నగేష్ రెడ్డి ఉదంతం మరిచిపోకముందే రెవిన్యూ శాఖలో మరో ఉదంతం వెలుగులోకి రావడం షాకింగ్‌.

- Advertisement -