టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైపోయింది. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్‌లో బంగారు పతకానికి మరో అడుగుదూరంలో నిలిచారు కమల్ ప్రీత్ కౌర్. తుదిపోరు కోసం నిర్వహించిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో 64 మీటర్లతో రెండో స్థానం సంపాదించి ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లారు కమల్ ప్రీత్.
డిస్కస్‌త్రో ఫైనల్ ఆగస్టు 2వ తేదీన జరగనుంది.. ఈ ఈవెంట్‌లో మొత్తం 12 మంది పోటీపడనున్నారు. కమల్‌ప్రీత్ ఫైనల్లోనూ మంచి ప్రదర్శన చేస్తే భారత్ ఖాతాలో మరో పతకం పడనుంది.
పంజాబ్‌కు చెందిన కమల్ ఈ ఏడాది అద్భుతఫామ్‌లో ఉన్నారు. ఇటీవల రెండుసార్లు 65 మీటర్ల మార్కును అధిగమించింది. మార్చిలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో ఆమె 65.06 మీటర్లు విసిరి జాతీయ రికార్డును అధిగమించి.. 65 మీటర్ల మార్క్‌ను అధిగమించిన మొదటి భారతీయురాలిగా నిలిచారు. ఆ తర్వాత జూన్‌లో, ఇండియన్ గ్రాండ్ ప్రి -4 సమయంలో 66.59 మీటర్లు విసిరి తన జాతీయ రికార్డును మెరుగుపరుచుకుని ప్రపంచ ఆరవ స్థానంలో నిలిచింది.