తేజస్వికి అండగా ‘మనం సైతం’

155
trivikram srinivas
- Advertisement -

పేదలను ఆదుకునేందుకు నేనున్నా అంటూ ముందుండే వ్యక్తి కాదంబరి కిరణ్. మనంసైతం అనే సంస్థను నెలకొల్పి తనవంతు సాయం అందిస్తున్న కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదవుల తల్లికి అండగా నిలిచారు. తేజస్వి తల్వ అమెరికాలోని అలబామాలో సైబర్ సెక్యూరిటీలో ఎంఎస్ చేద్దామని ఆశపడింది. కానీ ఆర్ధిక బలం లేదు, తండ్రి చనిపోయాడు, దిక్కుతోచని స్థితిలో ‘మనం సైతం’ ని ఆశ్రయించింది.

మనం సైతం కుటుంబంతో కలసి మొత్తం రూ.2 లక్షల 19 వేల రూపాయలను దర్శకులు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా తేజస్వికి అందించారు. అమెరికాలోని అట్లాంటాలో ఉండే డాక్టర్ ఈశ్వర్ గౌడ్, సాయిశశాంక్ 1 లక్షా 60 వేల రూపాయలు అందించారు. ఇతర మిత్రులు కూడా వీలైనంత సాయం చేశారు. మొత్తం రూ.2 లక్షల 19 వేల రూపాయలను దర్శకులు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా అందించానని కాదంబరి కిరణ్ వెల్లడించారు.

మా నాన్నగారు అకస్మాత్తుగా చనిపోవడంతో నా కలలన్నీ చెదిరిపోయాయి. ఆర్థికంగా మా కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఇక నేను మాస్టర్స్ చేద్దామనే కలను వదిలేసుకున్నానని తెలిపారు. ఇలాంటి టైమ్‌లో అమెరికా అలబామాలోని యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌కు అడ్మిషన్ ఆఫర్ వచ్చింది. ఎవరూ సాయం చేయలేదు. ఈ చదువు ఆపేద్దాం అనుకునే సమయంలో చివరి ప్రయత్నంగా ‘మనం సైతం’ కాదంబరి కిరణ్‌ని సంప్రదించగా తనవంతు సాయం అందించారని వెల్లడించింది తేజస్వి.

- Advertisement -