ఎడ్యుకేషన్ హబ్‌గా కమలాపూర్: వినోద్ కుమార్‌

30
b vinod kumar

కమలాపూర్‌ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని తెలిపారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. ఇవాళ సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగియనుండగా హుజురాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించారు వినోద్ కుమార్.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ని గెలిపించే బాధ్యత మీది.. హుజురాబాద్‌ అభివృద్ధి మాది అంటూ వ్యాఖ్యానించారు. హుజురాబాద్‌-జమ్మికుంట అర్బన్‌ డెవలపమ్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వరంగల్‌-హుజురాబాద్‌-మానుకొండూర్‌-కరీంనగర్‌ రైల్వేలైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని, కమలాపూర్‌లో వరి ఆధారిత పుడ్‌ ప్రాసెసింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.