సిద్ధూపై పోటీ పెడతాం: కెప్టెన్ అమరీందర్‌

32
amarinder singh

తాను కొత్త ఆర్టీ పెట్టడం ఖాయమని తేల్చిచెప్పారు పంజాబ్ మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్. ఎన్నికల కమిషన్ నుండి అనుమతి రాగానే పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపారు. సిద్దూ ఎక్కడి నుండి పోటీ చేసినా ఆయనపై పోటీ పెడతామన్నారు. ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీల్లో 92 శాతం తన హయాంలోనే నెరవేర్చినట్లు చెప్పారు.

తన లాయర్లు ఈసీతో కొత్త పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటున్నారని తెలిపారు. పంజాబ్ సెక్యురిటీ విషయంలో రాజీపడకుండా పనిచేశానని.. ఎప్పుడూ యోధుడిలా పోరాడానని చెప్పారు. తాను పెట్టబోయే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని, సీట్లు రెండు పార్టీలు షేర్ చేసుకుంటాయని అన్నారు. త్వరలో ఆ పార్టీ పేరు, గుర్తు, జెండా, ఎజెండాలను వివరిస్తానని అన్నారు.

పంజాబ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసినట్లు చెప్పిన అమరీందర్.. పంజాబ్ భద్రత నాకు చాలా ముఖ్యమని, ఆ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడలేదన్నారు. రాబోయే పార్టీతో కూడా అధికారంలోకి వచ్చి పంజాబ్ ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు.