నవంబర్ 25న విజయం సాధిస్తాం: సూర్య

55
sj

నవంబర్ 25న తాము విజయం సాధించబోతున్నామని ఎస్. జె. సూర్య వెల్లడించారు. శింబు హీరోగా వెంకట్ ప్రభుత్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మానాడు అనే టైటిల్‌ ఖరారు చేయగా కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

తెలుగులో ‘ది లూప్’ పేరుతో డబ్ చేస్తుండగా ఐదు భాషల్లో నవంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో విలన్‌గా ఎస్‌జే సూర్య నటిస్తుండగా ఇటీవలె తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ని పూర్తి చేశారు. ఎనిమిది రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేయాలని అనుకున్నామని, కానీ ఐదు రోజుల్లోనే కంప్లీట్ చేశానని తెలిపారు.

ఎనిమిది రోజుల పనిని ఐదు రోజులలో చేయడంతో ఒళ్ళు హోనం అయిపోయింది. నాడి, నరాలు, మెడ, వెన్నుపూస, గొంతు… అన్నీ పోయాయన్నారు. డబ్బింగ్ అవుట్ పుట్ ఎంతో సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ సినిమాలో భారతీరాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్, కరుణాకరన్‌, ప్రేమ్ జీ అమరన్ ఇతర సహాయ పాత్రలను పోషించారు.