నార్త్ లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతున్నప్పటికి.. అధిష్టానం దృష్టి మాత్రం సౌత్ రాష్ట్రాలపైనే ఉంది. ఎప్పటి నుంచో సౌత్ రాష్ట్రాలలో పాగా వేయాలని కమలం పార్టీ భావిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు సౌత్ ప్రజలు మాత్రం బీజేపీ ఆశలపై నీళ్ళు చల్లుతూనే ఉన్నారు. ఒక్క కర్నాటక మినహా మిగిలిన ఏ సౌత్ రాష్ట్రంలోనూ బీజేపీ బలంగా లేదు. ఇంకా చెప్పాలంటే కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కమలం పార్టీ ఉనికే లేదని చెప్పాలి. అంతో ఇంతో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడేందుకు చూస్తోంది. .
అయితే ఇప్పుడు ఆ ఆశలు కూడా నీరు గార్ఛెలా సౌత్ పాలిటిక్స్ కమలనికి షాక్ ఇస్తున్నాయి. తాజాగా తమిళనాడులో దాదాపు 13 మంది బీజేపీకి చెందిన కీలక నేతలు అన్నాడీఎంకే పార్టీలోకి చేరారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ అధిష్టానం ఉలిక్కిపడింది. మరికొంత మంది నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని వార్తాలు వస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే అన్నాడీఎంకే మరియు బీజేపీ పార్టీలు మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రపక్షమే చావు దెబ్బకొట్టినట్లైంది. కొన్ని రోజులుగా అన్నాడీఎంకే మరియు బీజేపీ మద్య అనిశ్చితి నెలకొంది. ఈ అనిశ్చితి కారణంగానే బీజేపీ నేతలకు అన్నాడీఎంకే పార్టీ ఏరా వేసిందని తమిళ్ పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
ఏది ఏమైనప్పటికి తమిళనాడులో బీజేపీకి తగిలిన దెబ్బ ఆ పార్టీని కుదిపేస్తుంది. ఇక ఏపీలో కూడా మిత్రపక్షం అయిన జనసేన వల్ల బీజేపీకి ఇబ్బందే అనే వాదన కూడా నడుస్తోంది. ఎందుకంటే బీజేపీతో పోలిస్తే జనసేన బలమైన పార్టీ… దాంతో ఎన్నికల సమయానికి కమలం పార్టీలో జంపింగ్ జపాంగ్ షురూ అయి నేతలు జనసేన వైపు చేసే అవకాశం లేకపోలేదు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. కొంత బలంగా ఉందనే కాన్ఫిడెంట్ కనబరుస్తున్నప్పటికి.. అవన్నీ ఒట్టి మాటలే అనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మొత్తాని సౌత్ లో బలపడాలని చూస్తున్న బీజేపీకి.. సౌత్ పాలిటిక్స్ కలవర పరుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి…