అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీకి చెందిన డోనాల్డ్ ట్రంప్,డెమొక్రాటిక్ పార్టీకి చెందిన జో బిడెన్ మధ్య హోరాహోరి పోటీ నెలకొనగా తాజాగా తమ పార్టీ తరపున ఉపాధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థిని ప్రకటించారు జో బిడెన్.
భారత సంతతి మహిళా,కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు బిడెన్. దీంతో అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన తొలి నల్లజాతీయురాలిగానూ కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు ఎంపికైన కమలా యూఎస్ సెనెట్‌కు ఎంపికైన తొలి భారతీయ అమెరికన్‌గా పేరు పొందారు. అంతేగాదు కాలిఫోర్నియా రాష్ట్రానికి రెండుసార్లు ఆమె అటార్నీ జనరల్‌గా చేశారు.
కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం చెన్నై. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండోలో స్థిరపడ్డారు. తర్వాత జమైకాకు చెందిన హ్యారిస్‌ను వివాహం చేసుకున్నారు. గత ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి బరిలోకి దిగి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన కమలా…. ఒకవేళ, బిడెన్ విజయం సాధించి, ఉపాధ్యక్షురాలిగా ఆమె ఎన్నిక కాగలిగితే.. 2024 అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేట్ అవుతారు.