అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా..

176
kamala
- Advertisement -

అమరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్‌కు అధికారాలను బదలాయించారు జో బైడెన్‌. బైడెన్ కు ప్ర‌తిఏటా పెద్ద పేగుకు సంబంధించి కొల‌నోస్కోపి ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. ఈ స‌మ‌యంలో మ‌త్తు మందు ఇస్తారు. ఆయ‌నకు ప‌రీక్ష‌లు పూర్త‌య్యి కోలుకునేంత వ‌ర‌కు క‌మ‌లా హారిస్ అధ్య‌క్షురాలిగా కొన‌సాగనున్నారు.

క‌మ‌లా హారిస్‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు వైట్ హౌస్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో అమెరికా అధ్య‌క్ష ప‌దివిని చేప‌ట్టిన తొలి మ‌హిళ‌గా క‌మ‌లా హారిస్ రికార్డ్ సాధించారు. గ‌తంలో బుష్‌కు కొల‌నోస్కోపి ప‌రీక్ష‌లు చేసిన స‌మ‌యంలో 2002, 2007లో బాధ్య‌త‌ల‌ను ఉపాధ్య‌క్షుడికి బ‌దిలీ చేసిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -