నవంబర్‌ 7న కమల్‌ పార్టీ..!

197
Kamal to Announce Political Party on November 7
- Advertisement -

సూపర్‌స్టార్ కమల్‌హాసన్ పొలిటికల్ ఎంట్రీ డేట్ దాదాపు ఖరారైంది. గత కొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటిస్తూ తమిళ పాలిటిక్స్‌పై ఎప్పటికప్పుడు స్పందిస్తు వస్తున్న కమల్..తన పుట్టినరోజు నవంబర్ 7న  పార్టీ ప్రకటించనున్నారు.చెన్నైలోని ఆళ్వారుపేటలోని తన నివాసంలో అభిమాన సంఘాల నేతలో సమావేశమైన కమల్.. తన బర్త్‌డే లోపు ఓ ప్రణాళికను ప్రిపేర్ చేస్తున్నట్లు సంకేతాలు అందించారు. తొలుత వచ్చే ఏడాది జనవరిలో పూర్తిస్ధాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమల్…అభిమానులతో సమావేశం తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

పార్టీ ఆవిర్భావం, జెండా-అజెండా, పార్టీ విధివిధానాల గురించి అభిమానులతో చర్చించినట్లు సమాచారం. జిల్లాల వారీగా చర్చించిన ఆయన పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి వారితో చేతులు కలపాలి? పార్టీ ఏర్పాటు తరువాత ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. తన పార్టీతో తమిళనాడుకు మంచి రోజులు వస్తాయని, గత, ప్రస్తుత పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని అభిమానులతో కమల్ చెప్పారు. తన పార్టీ డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగానే ఉంటుందని, అవినీతిపై పోరాటం కొనసాగుతుందని కమల్ స్పష్టం చేశారు.

ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై పలు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, కేరళ సీఎం పినరయి విజయన్,ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో కమల్ భేటీ అయ్యారు. వారి నుంచి కీలక వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాజకీయ పార్టీ పెడుతునే చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు కమల్.

- Advertisement -