ప్రశాంతంగా సింగరేణి పోలింగ్..

229
Singareni polls begins
- Advertisement -

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కోల్‌బెల్ట్‌లోని 11 ప్రాంతాల్లో 92 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 52,534 మంది ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్  జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి.

ఉదయం 10 గంటల వరకు 21,117 వేల ఓట్లు పొలయ్యాయి.  కొత్తగూడెంలో 24 ,  మందమర్రిలో 30, భూపాలపల్లి 28,   ఇల్లందులో 55,  శ్రీరాంపూర్ 35,  మణగూరు 33 ,బెల్లంపల్లిలో 47 శాతం పోలింగ్ నమోదైంది.

రాత్రి ఏడు గంటల నుంచి ఏరియాలవారీగా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. అర్ధరాత్రిలోగా తుది ఫలితం తేలే అవకాశం ఉన్నది. ఆరుజిల్లాల కలెక్టర్ల కార్యాలయం నుంచి ప్రతిపాదించిన రెవెన్యూ, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులనే పోలింగ్, పోలీస్, కౌంటింగ్ సిబ్బందిగా నియమించారు. పోలింగ్ కేంద్రాలు, ఓటుహక్కు వినియోగించుకోనున్నవారి జాబితాలను అన్ని కార్మికసంఘాలకు అందజేశారు.

ఓటింగ్‌లో పాల్గొనే కార్మికులు, ఉద్యోగులు తప్పనిసరిగా ఎంప్లాయీ ఐడీకార్డు తెచ్చుకోవాలి. లేకుంటే పాస్‌పోర్టు సైజ్ ఫొటో వెంట తెచ్చుకుంటే సింగరేణి లైజన్ ఆఫీసర్ తాత్కాలిక గుర్తింపు కార్డును జారీచేసి ఓటింగ్‌కు అనుమతిస్తారు.

నాలుగేళ్లకోసారి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఏఐటీయూసీ గెలిచింది. ఒక్కోసారి ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్ గెలిచాయి. ఈసారి ఏ కార్మిక సంఘం గెలుస్తుందన్నది అర్ధరాత్రి వరకు తెలియనుంది.

- Advertisement -