మీ విజన్‌ ఫెయిల్: మోడీకి కమల్ బహిరంగలేఖ

186
kamal modi

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బహిరంగలేఖ రాశారు మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు,సినీ నటుడు కమల్ హాసన్. 21 రోజులు లాక్ డౌన్ విధించాలని మోడీ తీసుకున్న నిర్ణయంతో పేదలు,అణగారిన వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.

డీమానిటైజేషన్ మాదిరిగా ఈసారి కూడా ప్రధాని మోడీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. నోట్ల రద్దు సమయంలో కూడా పేదలే నష్టపోయారని గుర్తుచేశారు. దీని ప్రభావం దేశ జీడీపీ మీద పడుతుందని హెచ్చరించారు.

డీమానిటైజేషన్ ప్రకటించినప్పుడు కూడా మీరు చేసింది కరెక్ట్ అని నమ్మాను. కానీ, అప్పుడు నేను అలా నమ్మడం తప్పు అని తెలిసింది. ఇప్పుడు మీరు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాలం నిరూపించింది సార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జాతి ఎంపిక చేసుకున్న నాయకుడు మీరు అంటూనే మోదీపై విమర్శలు చేసిన కమల్ ..మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజలను గందరగోళంలో పడేశాయి.. మిమ్మల్ని ఏమైనా అమర్యాదపరిచి ఉంటే దయచేసి క్షమించండి అని లేఖలో పేర్కొన్నారు కమల్.