ఎంపీల వేతనాల్లో 30శాతం కోత..

287
Union minister Prakash Javdekar

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరిగిన కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం ప్రధాని మోదీతో పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించాలని కేబినెట్‌ నిర్ణయించింది.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు కూడా తమ వేతనంలో 30శాతం స్వచ్ఛందంగా వదులుకున్నారు.జీతాల్లో కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈనేపథ్యంలో కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలియజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, పార్లమెంట్‌ సభ్యుల జీతాల్లో ఏడాది పాటు 30శాతం కోత విధించాము. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాల్లోనూ 30శాతం కోత విధించాం. అదేవిధంగా రెండేళ్ల పాటు ఎంపీ లాడ్స్‌ నిధులు ఉండవు వాటిని కరోనాపై పోరుకు ఉపయోగిస్తాం. 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఏడాది పాటు జీతాల్లో కోత అమలు చేస్తామని కేంద్ర మంత్రి జవదేకర్‌ అన్నారు.