సీఎం సహాయ నిధికి న్యాక్ ఉద్యోగుల విరాళం..

266
minister prashanth reddy

కరోనా(కోవిడ్-19) మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నాక్(NAC)కాంట్రాక్ట్ అండ్‌ ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)కి తమ ఒక రోజు వేతనాన్ని 2 లక్షల 18 వేల 63 రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఈ సందర్భంగా సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికారిక నివాసంలో న్యాక్(NAC) డైరెక్టర్ భిక్షపతి కలిసి సంబంధిత చెక్కును అందజేశారు.

ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా ఇచ్చిన విరాళానికి నాక్ (NAC)కాంట్రాక్ట్ అండ్‌ ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ అసోసియేషన్‌ను మంత్రి వేముల ప్రత్యేకంగా అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.