కమల్ విక్రమ్..నెంబర్ 1!

24
kamal
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ అవుతుండగా విడుదలైన సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కేజీఎఫ్ 2 ,ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేయగా తర్వాత వచ్చిన కమల్ విక్రమ్ సైతం భారీ వసూళ్లను రాబట్టింది.

ఇక ఇటీవల విడుదలైన చిత్రాల్లో మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ ఫిల్మ్స్‌ సినిమాలను ప్రకటించింది ఐఎండీబీ సంస్థ. ఇందులో కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిన విక్రమ్‌ 8.8 రేటింగ్‌తో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2 ..8.5 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. టాప్‌టెన్‌ చిత్రాల్లో మిగిలిన చిత్రాలు స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.

ఇక మూడోస్ధానంలో ది కశ్మీర్‌ ఫైల్స్‌ (8.3),హృదయం (8.1),ఆర్‌ఆర్‌ఆర్‌ (8.0),ఏ థర్స్‌డే (7.8), ఝండ్‌ (7.4),రన్‌వే 34 7.29,సమ్రాట్‌ పృథ్వీరాజ్‌ (7.2), గంగూభాయ్‌ కతియావాడి (7.0) పదో స్ధానంలో నిలిచింది.

- Advertisement -