కమల్…భారతీయుడు @ 25

63
kamal

శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’. ఈ చిత్రంలో కమల్‌ సేనాపతిగా నటించిచారు. ఈ పాత్ర చూసిన వారెవరికైనా మరిచిపోలేరు. లంచగొండి తనంపై పోరాడే స్వాతంత్ర్య సమరయోధుడిగా కమల్ నటన అద్భుతంగా సాగిందా చిత్రం ఇప్పటికి ఎప్పటికి ఎవర్‌గ్రీన్ మవీనే. 1996 మే 9న విడుదలైన భారతీయుడు ఓ సెన్సేషన్. తాజాగా మవీకి సీక్వెల్‌ కూడా వస్తున్న సంగతి తెలిసిందే.

కమల్ హాసన్ గెటప్స్, అభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కాగా, శంకర్ దర్శకత్వం మరో హైలైట్. దీనికి తోడు రెహ్మాన్ సంగీతం మరో ప్లస్ పాయింట్ అయింది. దీనికి తోడు అందాల భామలు మనీషా కొయిరాలు, ఊర్మిళ మటోంద్కర్ గ్లామర్ కూడా మరో ఎస్సెట్ గా భావించాలి.

పచ్చని చిలకలు తోడుంటే,టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే,మాయా మశ్చీంద్రా మచ్చను చూడగ వచ్చావా , అదిరేటి డ్రెస్సు మీరేస్తే పాటలు సూపర్బ్. ఈ సినిమాతో ఉత్తమ నటునిగా కమల్ హాసన్,ఉత్తమ కళాదర్శకునిగా తోట తరణి, విజువల్స్ ఎఫెక్ట్స్ లో ఎస్.టి.వెంకీ జాతీయ అవార్డులు అందుకున్నారు.