బిగ్ బాస్ హౌజ్ లోకి క‌మ‌ల్ హాస‌న్..

248
kamal hasan
- Advertisement -

లోక నాయ‌కుడు క‌మల్ హాస‌న్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ  ఇవ్వ‌నున్నాడు. ఆయ‌న న‌టించిన విశ్వ‌రూపం2 ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఆయ‌న తెలుగు బిగ్ బాస్ లోకి రానున్నాడు. విశ్వ‌రూపం2 సినిమా ఈనెల 10న తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఈసంద‌ర్బంగా ఈసినిమా ప్రమోష‌న్స్ లో బిజీగా ఉన్నారు క‌మ‌ల్ హాస‌న్. నేడు హైద‌రాబాద్ లో జ‌రుగునున్న ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు క‌మ‌ల్ హాస‌న్ హాజ‌ర‌వుతున్నారు.

vishwaroopam-2

త‌న చిత్రాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు క‌మ‌ల్ హాస‌న్ హైద‌రాబాద్ లోని బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు ముందు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ల‌నున్నాడు. త‌మిళ్ లో గ‌త సిజ‌న్ లో బిగ్ బాస్ వ్యాఖ్యాత‌గా క‌మ‌ల్ హాస‌న్ వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. బిగ్ బాస్ లోకి వెళ్ల‌డం ద్వారా త‌న సినిమాను మ‌రింత ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చ‌నుకుంటున్నాడు క‌మ‌ల్.

vishwaroopam-2

ఈమూవీలో క‌మ‌ల్ నటించ‌డంతో పాటు ద‌ర్శ‌క‌త్వం కూడా ఆయ‌నే చేశారు. ఇక క‌మ‌ల్ న‌టించిన విశ్వ‌రూపం మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో మ‌న‌కు తెల‌సిందే. ఇక త్వ‌ర‌లో వ‌స్తున్న విశ్వ‌రూపం సినిమా ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలి. ఈచిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న హీరోయిన్ గా పూజా కుమార్ న‌టించారు.

- Advertisement -