పారితోష‌కం త‌గ్గించిన స్టార్ క‌మెడీయ‌న్…

179
Sunil

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో స్టార్ క‌మెడీయ‌న్ గా ఎదిగాడు ప్ర‌ముఖ న‌టుడు సునీల్. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తో మ‌ర్యాద రామ‌న్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా సినిమాలు చేసిన‌ప్ప‌టి నుంచి కామెడీ పాత్ర‌ల‌కు దూరంగా ఉన్నాడు. అయితే మొదట ఆయ‌న చేసిన రెండు, మూడు సినిమాలు బాగానే ఆడిన ఆత‌ర్వాత వ‌చ్చిన సినిమాలు మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. వ‌రుసగా ఆయ‌న న‌టించ‌ని సినిమాలు ప‌రాజ‌యం అవ్వ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్నాడు సునీల్. సినిమాలు ఆడ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ పాత‌గూటినే న‌మ్ముకున్నాడు.

sunil turns comedian again

క‌మెడీయ‌న్ గా మ‌ళ్లీ కెరీర్ ను ప్రారంభించాడు. ప్ర‌స్తుతం రెండు పెద్ద సినిమాల్లో న‌టిస్తున్నాడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాలో న‌టిస్తుండ‌గా, ర‌వితేజ, శ్రీనువైట్ల కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న అమ‌ర్, అక్బ‌ర్, అంటోని సినిమాలో న‌టిస్తున్నాడు.

silly fellows movie

ఈసినిమాల‌తో పాటు భీమినేని శ్రీనివాస్ రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సిల్లీ ఫెలోస్ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ తో క‌లిసి న‌టిస్తున్నాడు. ఈచిత్రానికి సునీల్ త‌న పారితోష‌కాన్ని త‌గ్గించుకున్నాడ‌ట‌. ఇంత‌కుముందు త‌న సినిమాల‌కు రూ. 4కోట్లు తీసుకున్న సునీల్, ఇప్పుడు ఈసినిమాకు రూ. 1.5కోట్లు మాత్ర‌మే తీసుకుంటున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న కామెడీ పాత్ర‌ల‌కు కూడా అంతే పారితోష‌కం తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది.