బుల్లి తెరపై లోకనాయకుడు…!

160
Kamal Haasan to make his television debut..!

కమల్‌హాసన్‌.. పరిచయం అక్కర్లేని పేరు. తన నటన, పాత్రలతో ఎల్లలు లేని అభిమానులను సొంతం చేసుకుని ‘లోకనాయకుడు’ అనిపించుకున్నారు. వెండితెరపై ప్రయోగాత్మక పాత్రలకి ప్రాణం పోసిన వారాయన. కొత్తదనానికి కొత్త దారులు తెరచిన కమల్, త్వరలో బుల్లితెరపై సందడి చేసే ఛాన్స్ ఉందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.

తమిళంలో ప్రముఖ టీవీ ఛానల్ వారు .. ‘బిగ్ బాస్’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.  ‘బిగ్‌బాస్‌’కు ఉత్తరాదిన విశేష ఆదరణ ఉంది. అర్షద్‌ వర్సి, అమితాబ్‌ బచ్చన్‌, సంజయ్‌దత్‌లతో పాటు సల్మాన్‌ఖాన్‌ కూడా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్‌కు కమల్‌హాసన్‌ అయితే చక్కగా సరిపోతారని భావిస్తున్నారు.భారీస్థాయిలో రూపకల్పన చేసిన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించమని వాళ్లు కమల్ ను కోరారట. అందుకు ఆయన సుముఖంగానే వున్నట్టుగా కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. ఇందుకోసం కమల్‌కు భారీగానే ముట్టజెప్పనున్నారట.

ప్రస్తుతం కమల్ శబాష్ నాయుడు అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. శృతి హాసన్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసనే తెరకెక్కించాడు. విశ్వరూపం అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ… ఆ సినిమాను కూడా వదిలిపెట్టడం లేదు కమల్. విశ్వరూపం2 తెరకెక్కించునున్నారట. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, నాగార్జున, చిరంజీవి… ఇంతవరకు బుల్లి తెర ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటులు. ఆ కోవలోకి త్వరలో లోకనాయకుడు చేరబోతున్నాడు.