టీఆర్ఎస్‌తోనే బంగారు తెలంగాణ

150
KTR In Jagithyala Janahitha Pragathi Sabha

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు మంత్రి కేటీఆర్. జగిత్యాల జిల్లాలో జరిగిన జనహిత ప్రగతి సభలో మాట్లాడిన కేటీఆర్…కాంగ్రెస్,టీడీపీలపై మండిపడ్డారు.మిషన్ కాకతీయ,మిషన్ భగీరథపై అవాకులు,చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వైఎస్ తొత్తు….ఎల్ రమణ చంద్రబాబు తొత్తని విమర్శలు గుప్పించారు.

టీఆర్ఎస్ ఏ పనిచేసినా దానిపై విమర్శలు గుప్పించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని తెలిపారు. కాంగ్రెస్‌తో ఉదు కాలదు పీరు లేవదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోషించిన పాత్రం ఎంటో అందరికీ తెలుసని….ఆయన ఆంధ్రా పాలకుల తొత్తని మండిపడ్డారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచిందని చెప్పిన కేటీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సీఎం అండగా ఉన్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పారు.

పేదవాళ్లకిచ్చే బియ్యంపై సిలింగ్ ఎత్తివేసి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరుకిలోల బియ్యం ఇస్తున్నామని తెలిపారు. రుణమాఫీ చేసి కేసీఆర్ రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని చెప్పారు.ఉచితంగా ఎరువులు పంపిణీ చేసి రైతులకు భరోసా కల్పించారని తెలిపారు.జగిత్యాలను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి ఏంచేసిందని మండిపడ్డారు.

kavitha-sabha

జగిత్యాల జిల్లా కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని ఎంపీ కవిత అన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలకు రూ.150 కోట్లు ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కవిత ధన్యవాదాలు తెలియజేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన జనహిత ప్రగతి సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నరని స్పష్టం చేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే ఎమ్మేల్యే జీవన్‌రెడ్డి మభ్యపెడుతున్నరన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.