- Advertisement -
విశ్వనటుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. ఈ వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం ఆయనకు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని కమల్ హాసన్ వెల్లడించారు. కొన్నిరోజుల కిందట అమెరికా వెళ్లానని, తిరిగి వచ్చిన తర్వాత దగ్గు వస్తుండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని తెలిపారు. కరోనా ఉందని వైద్యులు చెప్పడంతో ఆసుపత్రిలో చేరానని వివరించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కమల్ పిలుపునిచ్చారు.
- Advertisement -