కమల్‌ను ఏడిపించిన రజినీ..!

171
Kamal Haasan is the angriest person
Kamal Haasan is the angriest person

ఒకప్పుడు ఆ ఇద్దరు నటులు పోటా పోటీగా నటించినా..ఇప్పుడు ప్రపంచం గుర్తించిన స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు బాలచందర్‌ శిష్యులు సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్. కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ ఈ మద్య కాలం చేసిన విషయం తెలిసిందే. చెన్నై లో కమల్ సోదరుడు చంద్రహాసన్ సంస్మరణ సభ జరిగింది . ఆ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చంద్రహాసన్ కు నివాళులు అర్పించడమే కాకుండా కమల్ ఓదార్చారు.

download

ఈ కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు కమల్‌కు కన్నీళ్లు తెప్పించాయి. ‘ నిజానికి ఇవాల్టి తరం నటులతో పోల్చితే నా స్నేహితుడు కమల్ దగ్గర చాలా తక్కువ డబ్బులే ఉంటాయి. కమల్‌ డబ్బు గురించి పట్టించుకోడు. తన వద్ద డబ్బు ఎప్పుడూ ఉంచుకోడు. కమల్‌ వద్ద కొంతైన డబ్బు ఉందంటే దానికి కారణం ఆయన అన్నయ్య చంద్రహాసన్‌. కమల్ హాసన్ లాంటి షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తి నేను నా జీవితంలో చూడలేదు. కమల్‌కు షార్ట్‌ టెంపర్‌ బాగా ఎక్కువ. మీరు ఆయనలో 10 శాతం కోపాన్ని చూసి ఉంటారు. నేను 100 శాతం కోపం కూడా చూశాను. అందుకే తనతో డీల్ చేసేటపుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. అందుకే కమల్‌తో చాలా జాగ్రత్తగా ఉంటా.
raj_147040714115_647x404_080516080345
కమల్‌ హాసన్‌ను బ్యాలెన్స్‌గా ఉంచే వ్యక్తులు బాలచందర్‌గారు, అనంత్‌, చారు హాసన్‌, చంద్రహాసన్‌. ఇప్పుడు ఇందులో ముగ్గురు లేరు. కమల్ కోపాన్ని ఎక్కువగా తగ్గించేందుకు ప్రయత్నం చేసింది చంద్రహాసన్. చంద్రహాసన్‌ మరణం కమల్‌కు తీరని లోటు. అయితే కమల్‌కు ఒక్క విషయం చెబుతున్నా. నీకు తోడుగా మేమందరం ఉన్నాం’ అని రజనీకాంత్‌ అన్నాడు. దీంతో కమల్‌ ఉద్వేగాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఏడ్చేశాడు.