అలా మాట్లాడితే…లింక్‌ పెట్టేస్తారా..

329
Jasmin Bhasin denies dating Siddharth Shukla

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకుంటే ఖచ్చితంగా వారి మధ్య ఏదో జరుగుతున్నట్టే. అయితే కాస్త క్లోజ్‌గా ఉన్నాసరే వారి మధ్య ప్రేమ, డేటింగ్‌ వంటి లింకులుంటాయి. ఇది ప్రస్తుతం కొంతమంది అభిప్రాయం. అందరూ కాకపోయినా కొంత మంది మాత్రం ఇలాగే ఉంటారు. ఇలాంటి వారి వల్ల ఇతరులు చాలా ఇబ్బందులు పడుతుంటారనేది వాస్తవం.

అయితే ఇలాగే తనపై లేని రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారంటూ తెగ బాధపడిపోతోంది నటి జాస్మిన్ భాషిన్. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి క్లోజ్‌గా ఉంటే చాలు డేటింగ్, ప్రేమ అంటూ ఏదో లింకులు పెడతారని ఫైర్‌ అయింది. అయితే జాస్మిన్‌ తన కో స్టార్ సిద్ధార్థ శుక్లాతో కొంతకాలం నుండి డేటింగ్ చేస్తోందన్న వార్తలు జోరందుకోవడంతో దానిపై తీవ్రంగా స్పందించింది ఈ మోడల్‌. ఆడా, మగ సరదాగా మాట్లాడుకోడం కూడా తప్పేనా, అలా కనిబడితే చాలు వారి మధ్య ఏదో రిలేషన్ ఉందని ప్రచారం చేస్తారని మండిపడింది జాస్మిన్‌.
Jasmin Bhasin denies dating Siddharth Shukla
తెలుగులో సాయిరామ్ శంకర్ నటించిన ‘దిల్లున్నోడు’ సినిమాలో జాస్మిన్‌ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు తనపై వచ్చిన వార్తలను చాలా సీరియస్‌ గానే తీసుకుందని, అందుకే ఇంతలా ఫైరవుతోందని అంటున్నారు. ఇక ఈ వార్తలకు సిద్దార్థ కూడా కారణమయ్యాడు కాబట్టి తన గురించి కూడా చెప్పుకొచ్చింది జాస్మిన్‌.

సిద్ధార్థ చాలా కూల్‌గా ఉంటాడని,  ఎప్పుడు జోకులేస్తూ అందరినీ నవ్విస్తుంటాడని, అందుకే సిద్ధార్థ తనకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ చెప్పుకొచ్చింది జాస్మిన్‌. అంతేకాకుండా కెరీర్ మీద దృష్టిపెట్టిన తనకు ప్రేమలో పడే తీరిక లేదంటూ బదులిచ్చింది.

తనపై వచ్చిన వదంతులను  కొట్టిపారేస్తూ..ఆడా, మగవారు స్నేహితులుగా ఉండటం కూడా తప్పేనా అంటూ ఘాటుగానే వ్యాఖ్యానించింది ఈ హీరోయిన్‌. మొత్తానికి అలాంటి మైండ్‌సెట్‌ తో ఉండే వారికి జాస్మిన్‌ మాటలు గట్టి వార్నింగ్‌ లాగే వినిపిస్తాయేమో మరి.