‘క్షత్రియ పుత్రుడు 2’కి రెడీ అవుతున్న కమల్‌..

316
Kamal Haasan
- Advertisement -

విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం క్షత్రియ పుత్రుడు. తమిళంలో తెవర్మగన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి 1992లో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కమల్ హసన్ నిర్మాతగా రచయితగా వ్యవహరించి నటించారు. సినిమాలో కమల్ హసన్, శివాజీ గణేశన్, రేవతి, గౌతమి, ప్రధాన ప్రాత్రల్లో నటించారు. ప్రస్తుతం కమల్‌ ఈ మూవీ సీక్వెల్ చేయడానికి కమలహాసన్ ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. ఇటీవల ‘విశ్వరూపం 2’ సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Kamal Haasan

ప్రస్తుతం కమల్‌ ‘భారతీయుడు’ సినిమా సీక్వెల్లో చేయడానికి రెడీ అవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ‘భారతీయుడు 2’ తరువాత క్షత్రియ పుత్రుడు సీక్వెల్‌ పట్టాలెక్కుతుందని కమల్ చెప్పారు. మొత్తానికి కమల్ మూడవ సీక్వెల్‌కి కూడా రెడీ అవుతున్నారన్న మాట.

- Advertisement -