చావడానికి సిద్ధం..!

197
Kamal Expresses Grief Over Video Of His Poster
- Advertisement -

త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్న తమిళ నటుడు కమల్ హాసన్‌ ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాడు. ఇటీవల  ఓ ఇంటర్వ్యూలో దేశంలో హిందూ ఉగ్రవాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై  బీజేపీ దాని అనుబంధ సంఘాలు మండిపడగా పలువురు కమల్‌కు మద్దతుగా నిలిచారు.

ఈ నేపథ్యంలో క‌మల్ చేసిన సంచ‌ల‌న కామెంట్స్‌కి నిర‌స‌న‌గా కొంద‌రు వ్య‌క్తులు ఓ వీడియోని రూపొందించారు. ఇందులో ఇద్ద‌రు పిల్ల‌లు క‌మ‌ల్ పోస్ట‌ర్స్‌పై క‌త్తితో దాడి చేస్తున్న‌ట్టు చూపించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా క‌మ‌ల్ కంట కూడా ప‌డింది.

దీనిపై స్పందించిన కమల్‌.. ఈ వీడియో చూడటం కంటే వారి చేతుల‌లో చావ‌డమే మంచిది.. ప్ర‌కృతి ఎలాగు న‌న్ను చంపేస్తుంది. దాని కంటే ముందు న‌న్ను చంపే హ‌క్కు మీకే ఉంది.. చంప‌డానికి ట్రై చేయండి. నేను త‌ప్ప‌క గెలుస్తాను అని   ట్వీట్ చేశారు. క‌మ‌ల్ చేసిన ఈ ట్వీట్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కమల్ కు మద్దతుగా ప్రకాష్ రాజ్, కుష్భూలు పోస్టులు పెట్టారు.

https://twitter.com/tamilsviews/status/930506237438857216

- Advertisement -