“ఎంత మంచివాడవురా” ట్రైలర్ టైం ఫిక్స్

585
enta manchivadvra
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచివాడవురా మూవీ తెరకెక్కింది. ఈమూవీలో మెహరిన్ హీరోయిన్ గా నటించగా సతీష్ వేగశ్న దర్శకత్వం వహించారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రాన్ని సంక్రాంతి పండుగ రోజు జనవరి 15న విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా ఇవాళ సాయంత్రం ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

ఈవేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఇవాళ రాత్రి 7.45గంటలకు ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈమధ్యలో కళ్యాణ్‌ రామ్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా హిట్ కాకపోవడంతో ఈమూవీపై కళ్యాణ్ రామ్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు.

- Advertisement -