విజేత కోసం.. చిరుతో పాటు మ‌రో ఇద్ద‌రు..

408
kalyan dev and chiranjivi
- Advertisement -

చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్ ని చిత్ర యూనిట్ ఘ‌నంగా నిర్వ‌హించ‌నుంది. చిరు చిన్న అల్లుడి తొలి సినిమా కావ‌డంతో మామ చిరంజీవి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నారు. అందుకే జూన్ 24న జ‌రిగే ఆడియో ఫంక్ష‌న్ కి ముఖ్యఅథితిగా హాజ‌రుకానున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తో పాటు మ‌రో ఇద్ద‌రు మెగా హీరోలు కూడా ఆడియో ఫంక్ష‌న్ కి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

kalyan dev and chiranjivi

ఈ సినిమాకి భారీ స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించాల‌నే ఉద్దేశ్యంతో రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ  ఈ ఫంక్ష‌న్ కి  వెళ్ల‌నున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ముగ్గురు మెగా హీరోలు క‌లిసి ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్నారు. వారాహి చ‌ల‌న చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కల్యాణ్ దేవ్ కి జోడీగా మాళవిక నాయర్ నటించింది. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ కానుంది. మొద‌టి సినిమాతో హిట్ కొట్టాల‌నుకున్న క‌ల్యాణ్ దేవ్ న‌ట‌న‌, డ్యాన్స్ , ఫైట్ల విష‌యంలో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీస‌కున్నార‌ట‌.

Chiry and allu arjun and ramcharan

మ‌రోవైపు వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌వుతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ కోసం ఇద్ద‌రు మామ‌య్య‌లు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకున్నార‌ట‌. సాయి కోసం మంచి క‌థ‌ను సిద్దం చేయండి అంటూ పెద్ద ద‌ర్శ‌కుల‌కు అటు చిరంజీవి, ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ అడుతున్నార‌ట. సాయి ధర‌మ్ తేజ్, అల్లు రిలీజ్, క‌ల్యాణ్ దేవ్ సినీ భ‌విష్యత్తుపై మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ప్రత్యేక శ్ర‌ద తీసుకున్నార‌నే చెప్పాలి.

- Advertisement -