కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం కాదు!

5
- Advertisement -

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న పుకార్లను ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారం తీవ్రంగా ఖండించారు. అటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రసక్తే లేదు. మీడియాలో వస్తున్న ఇటువంటి నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి. మమతా బెనర్జీ నాయకత్వంలో టీఎంసీ తన సొంత గుర్తింపుతోనే బలంగా ముందుకు సాగుతుంది అని స్పష్టం చేశారు.

ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో, లోక్‌సభలో ఇరు పార్టీల మధ్య సహకారం పెరగడం వల్ల టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు విలీనం కాబోతున్నాయనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. ఈ నేపథ్యంలో కల్యాణ్ బెనర్జీ చేసిన ప్రకటన ఈ పుకార్లకు చెక్ పెట్టింది.

బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీలు ,ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మమతాపై అసంతృప్తి గళాన్ని వినిపించారు.

Also Read:రోజు పదివేల అడుగులు నడుస్తున్నారా?

- Advertisement -